నవతెలంగాణ-నవాబు పేట
పాలమూర్ – రంగారెడ్డి భూ నిర్వాసితులు బుధవారం యన్మంగండ్ల గెట్ నుండి నవాబుపేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉదందాపూర్ రిజర్వాయర్ నుండి లక్ష్మిదేవిపల్లీ రిజర్వాయర్ వరకు సాగునిటిని తరలించే ప్రధాన కాల్వ నవాబుపేట మండలం పరిధిలోని కారుకొండ, రుద్రారం, యన్మన్గండ్ల నవాబు పేట, కామరాం అమ్మాపూర్ తదితర గ్రామాల మీదుగా వెళ్లే రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అక్కడి రైతులకు అమలు పరిచినట్టు ఆర్& ఆర్ (పునరావాసం, పునర్ నిర్మాణం) ప్యాకేజి అమలు చేయాలనీ కోరారు. పాదయాత్ర అనంతరం నవాబుపేట పాత బస్టాండులోని బి.అర్.అంబేద్కర్ విగ్రహానికి రైతులు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని, తహసీల్దార్ సురేష్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమనికి ఆయా గ్రామాల రైతులతో పాటు నవాబు పేట మండల బిఅర్ఎస్ పార్టీ నాయకులు మద్దతూ పలికారు. వీరితో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి భూ నిర్వాసితుల పాదయాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



