Wednesday, July 29, 2026
E-PAPER
Homeజిల్లాలుగురుకుంటలో నూతన పాఠశాల భవనం ప్రారంభం 

గురుకుంటలో నూతన పాఠశాల భవనం ప్రారంభం 

- Advertisement -

ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీల ఫౌండర్, చైర్మన్, ఎండీ మన్నె సత్య నారాయణ రెడ్డి 
నవతెలంగాణ-నవాబు పేట
మండల పరిధిలోని గురుకుంట గ్రామంలో ఎంఎస్ఎన్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీల ఫౌండర్, చైర్మన్, ఎండీ మన్నె సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మన్నె ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సొంతూరును కొంతైనా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది ఉందని, గ్రామ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలు ఇంతటితో ఆగవనీ, మున్ముందు మరెన్నో చేపట్టే ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, తహశీల్దార్ సురేష్, సింగల్ విండో చైర్మన్ నర్సిములు, మాజీ జడ్పీటీసీ ఇందిరాదేవి, శ్రీనివాస్ రాజు పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తులసి రామ్ నాయక్, సర్పంచ్ రవీందర్ రెడ్డి, గురుకుంట సర్పంచ్ బాల్ రాజ్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉప సర్పంచ్ బోవళ్ల రాజశేఖర్, ఎంఎస్ఎన్ సేవ సమితి అధ్యక్షుడు కర్ణం ప్రతాప్, శ్రీనివాస్ రవిందర్ రెడ్డి, పురుషోత్తం రవి, గురుకుంట మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -