అటవీశాఖ రేంజ్ అధికారి రాథోడ్ రమేష్
నవతెలంగాణ-కుభీర్
అంతర్జాతీయ పులుల దినోత్సవ సందర్బంగా బుధువారం మండలంలోని డోడర్నా, బెల్గం తండా1 లో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీశాఖ అధికారి రాథోడ్ రమేష్ సూచించారు. దింతో పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన,చిత్ర లేఖన పోటీలు నిర్వహించి విద్యార్థులకు పులుల సంరక్షణ,వాటి అవాసాలు, మరియు అడవులు వన్య ప్రాణుల ప్రాముఖ్యత అనే అంశాల పై పోటీలు నిర్వహించారు.ఈ సందర్బంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ జీవవైవిద్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పులుల పాత్ర ఎంతో కీలకమైనది అన్నారు.
దీంతో అడవులు సంరక్షిస్తేనే వన్యప్రాణులు సురక్షితంగా ఉంటాయన్నారు. అడవులను వన్య ప్రాణులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని విద్యార్థులకు తెలియజేశారు. అడవిలో ఏవైనా అనుమానాస్పద కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు. అదేవిధంగా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు వేయడం వన్యప్రాణులను వేటాడడం చట్టారీత్యా నేరం అని ప్రేమలకు ఎటువంటి హాని కలిగించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు “పులులను కాపాడుదాం -అడవులను రక్షిద్దాం ” అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్,బెల్గం సర్పంచ్ జాదవ్ గోకుల్, అటవీశాఖ సెక్షన్ అధికారి లక్ష్మణ్, బీట్ ఆఫీసర్ రాజేష్,శివకుమార్,యానిమల్ ట్రాకర్ శివ ప్రసాద్ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.



