Tuesday, September 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పాలనను విమర్శిస్తే ఖబర్దార్ మర్రి జనార్ధన్ రెడ్డి 

కాంగ్రెస్ పాలనను విమర్శిస్తే ఖబర్దార్ మర్రి జనార్ధన్ రెడ్డి 

- Advertisement -

ఐఎన్ టియుసి అధ్యక్షులు మహబూబ్ అలీ
నవతెలంగాణ-అచ్చంపేట
అచ్చంపేట ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలనను విస్మరిస్తున్నానీ, అర్థంకాని మాటలు మాట్లాడితే అచ్చంపేట ప్రాంత ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరని ఖబర్దార్ మర్రి జనార్ధన్ రెడ్డి అని ఐఎన్ టియుసి అధ్యక్షులు మహబూబ్ అలీ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలను, సంక్షేమ పథకాల అమలు తీరును ఇతర రాష్ట్రాలలో రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు.

సీఎం పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నారనీ, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఉచితం, రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు బీమా, సన్నబడ్లకు రూ.500 బోనస్, మహాలక్ష్మి గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం అమలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక మర్రి జనార్దన్ రెడ్డికి ఏమి తోయక తికమక మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. మా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి  చేయటానికి నిరంతరం కృషి చేస్తున్నాడని గుర్తు చేశారు. టౌన్ అధ్యక్షులు సలేశ్వరం ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు మౌలానా, ఐఎన్టియుసి బల్మూరు మండల అధ్యక్షులు చందు నాయక్, ఐఎన్టియుసి ఉప్పునుంతల మండల అధ్యక్షులు రామచంద్రయ్య, ఐఎన్టియుసి తాలూకా కార్యదర్శి శ్రీ రామ్ నాయక్, స్వామి గౌడ్, రాజు, వెంకటేష్, మహేష్ లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -