Wednesday, May 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల్ని చైతన్యపరిచే కళారూపాలు రావాలి

ప్రజల్ని చైతన్యపరిచే కళారూపాలు రావాలి

- Advertisement -

ప్రొఫెసర్‌, ఎమ్మెల్సీ కోదండరామ్‌
లౌకిక భావాలను పెంచే సాహిత్యం పెరగాలి : ఈటీ నర్సింహ
టీపీఎన్‌ఎమ్‌ రాష్ట్ర నాలుగో మహాసభలు ప్రారంభం

‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సమాజాన్ని మేల్కొల్పి చైతన్యం చేసే విధంగా కళాకారులు తమ సాంస్కృతిక దృష్టి కోణాన్ని మలుచుకుని కళారూపాలను రూపొందించాలని టీజేఎస్‌ అధ్యక్ష‍ులు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ ‌ఎం.కోదండరామ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజానాట్యమండలి నాలుగో రాష్ట్ర మహాసభలో భాగంగా ప్రతినిధుల సభ మంగళవారం హైదరాబాద్ లోని దేశోద్దారక భవన్ లో ప్రారంభమైంది. మహాసభను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ.నరసింహ ప్రారంభించారు. సభలో ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..సమస్య తీవ్రతను ప్రజలకు అర్థమయ్యేలా చైతన్యపరిస్తేనే ఉద్యమం ఉప్పెనలా మారుతుందనీ, తద్వారా సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. గూడ అంజయ్య రాసిన “దొర ఏందిరో… దొర పీకుడెందిరో” పాట ఒక శక్తిగా మారి నాడు కార్మికులను, పనిమనుషులను కార్యోన్ముఖులను చేసిందని గుర్తు చేశారు. ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని రెచ్చగొట్టే కుట్రలకు నేటి పాలకులు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. యువ కళాకారులు ధైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు.‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఈటీ.నర్సింహ మాట్లాడుతూ..మతోన్మాద శక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నాయని విమర్శించారు. కళాకారులు తమ పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలనీ, లౌకిక భావాలను పెంచే సాహిత్యాన్ని తీసుకురావాలని కోరారు. ప్రధానంగా సోషల్ మీడి‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌యా ద్వారా కళారూపాల ప్రదర్శన పెరగాలన్నారు. హైదరాబాద్ పాతబస్తీకి పరిమితమైన ఎంఐఎం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిందంటే ఎవరి వల్ల సాధ్యమైందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) పేరుతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్.చాయాదేవి, ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) జాతీయ కౌన్సిల్ సభ్యులు కె.స్వామి, తెలంగాణ ప్రజానాట్యమండలి అధ్యక్షులు కె.శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి పల్లె నరసింహ, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, కోశాధికారి పడాల నళిని, సహాయకార్యదర్శి కొండల్ రావు, కె. ఉప్పలయ్య, నాయకులు జగన్, సీపీఐ హైదరాబాద్ కార్యదర్శి స్టాలిన్, కార్యవర్గ సభ్యులు నెర్లకంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -