Wednesday, May 27, 2026
E-PAPER
Homeజాతీయంఈడీ దాడుల వెనుక కాంగ్రెస్ హ‌స్తం: ఎంపీ జాన్ బ్రిట్టాస్

ఈడీ దాడుల వెనుక కాంగ్రెస్ హ‌స్తం: ఎంపీ జాన్ బ్రిట్టాస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేర‌ళం మాజీ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఇంట్లో ఈడీ సోదాలను సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఖండించారు. రాజ‌కీయ క‌క్ష‌సాధింపు ఈడీ దాడుల వెనుక బీజేపీతో పాటు కాంగ్రెస్ హ‌స్తముంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.కేంద్ర ఏజెన్సీలు ప్ర‌తిప‌క్ష సీపీఐ(ఎం)ను లక్ష్యంగా చేసుకున్నాయని, తప్పుడు కేసులు బనాయించి విజయన్‌ను అణగదొక్కడానికి రాజకీయ ప్రత్యర్థులు ఏకమయ్యారని ఆయ‌న ధ్వ‌జ‌మోత్తారు.

“మేము ఆశ్చర్యపోలేదు. ఇది రాజకీయ కక్ష సాధింపునకు స్పష్టమైన నిదర్శనం. కామ్రేడ్ పినరాయి విజయన్‌ను కేంద్ర ఏజెన్సీలు చాలాసార్లు వేధించాయి. ఎమర్జెన్సీ సమయంలో, ఆయనను కొట్టారు, ఆ స‌మ‌యంలో ఆయనను భౌతికంగా హతమార్చే ప్రయత్నం జరిగింది. ఆయనపై అనేక కేసులు తప్పుగా మోపబడ్డాయి. ఈ నాటకంలో బీజేపీ ఒంటరిగా లేదనే వాస్తవాన్ని కూడా మనం నొక్కి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఆటలో భాగమే.”

ఈ కేసును ఎఫ్‌బిఐ, మొస్సాద్, లేదా ఇంటర్‌పోల్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలకు అప్పగించినప్పటికీ, ఎలాంటి దర్యాప్తుకైనా సీపీఐ(ఎం)కి అభ్యంతరం లేదని, ఇప్పటికే నాలుగు కేంద్ర ఏజెన్సీలు ఈ విషయంపై పనిచేస్తున్నాయని, “ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, రాహుల్ గాంధీ కేరళకు వచ్చి, రాష్ట్రంలో పర్యటించి, అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ‘కేంద్ర ఏజెన్సీలు పినరాయి విజయన్‌ను అరెస్టు చేయడం లేదు, ఎందుకు జైలులో నిర్భందించ‌డం లేదని ప్ర‌శ్నించార‌ని’ అని ఆయ‌న కేర‌ళం తిరువనంతపురం మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -