- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని (uday krishna reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులో కస్టడీలోకి తీసుకొని అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జాతీయ పోలీసు అకాడమీలో తనపై వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఈ నెల 18న అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగికంగా వేధించడంతో పాటు.. వ్యక్తిగత వీడియోలను తన భర్తకు పంపించి ఇబ్బందులకు గురి చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -



