Monday, September 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ
 ప‌దవుల‌కు పోటాపోటీ

కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ
 ప‌దవుల‌కు పోటాపోటీ

- Advertisement -


మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి సామాకు ఓకే?
న‌ల్ల‌గొండ నుంచి అమిత్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్‌లలో ఒక‌రికి ఛాన్స్
న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్

అధికార కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ప‌దవుల‌కు విప‌రీత‌మైన పోటీ నెల‌కొంది. వ‌చ్చే ఏడాది మార్చిలో నిర్వ‌హించ‌బోయే న‌ల్ల‌గొండ‌-ఖ‌మ్మం- వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌-హైద‌రాబాద్‌-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన నేపథ్యంలో సీనియ‌ర్ నేత‌లు, ఆశావ‌హులు త‌మత‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఆయా స్థానాల్లో ఎవ‌రెవ‌రికి స్థానం క‌ల్పించాల‌నే దానిపై ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి, పీసీసీ చీఫ్ స్థాయిలోనే లోతైన చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క నివాసంలో కూడా దీనిపై స‌మాలోచ‌న‌లు చేసిన‌ట్టు తెలిసింది. గ్రాడ్యుయేట్ స్థానాల‌కు సంబంధించి ఇప్ప‌టికే ఆశావ‌హుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించిన నేపథ్యంలో వాటిని మ‌రింత‌గా ప‌రిశీలించి, సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, నేత‌ల సామ‌ర్థ్యాలు, పార్టీతో స‌మ‌న్వ‌యం త‌దిత‌రాంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. అయితే అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం… మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానానికి కాంగ్రెస్ మీడియా అండ్ క‌మ్యూనికేష‌న్ విభాగం మాజీ చైర్మెన్ సామా రామ్మోహ‌న్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ వాయిస్‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌టం, మీడియా చ‌ర్చ‌గోష్టుల్లో మిగ‌తా వారి కంటే భిన్నంగా విశ్లేష‌ణ‌లు చేయ‌టం, ప్ర‌తిప‌క్షాల‌ను సునిశితంగా, సూటిగా విమ‌ర్శించ‌టం త‌దిత‌రాంశాల‌ను ఆయ‌నకు క‌లిసొచ్చాయ‌ని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. మ‌రోవైపు న‌ల్ల‌గొండ స్థానం నుంచి మండ‌లి చైర్మెన్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి త‌న‌యుడు గుత్తా అమిత్ రెడ్డి, ఆర్టీఐ క‌మిష‌న‌ర్ పీవీ శ్రీనివాస్‌ల‌లో ఎవ‌రికో ఒక‌రికి ఛాన్స్ ద‌క్కేలా క‌న‌బ‌డుతోంది. వీరితోపాటు ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌చ్చినా ఆ ఇద్ద‌రి పేర్లే ప్ర‌ముఖంగా విన‌బ‌డుతున్నాయి. మ‌రోవైపు న‌వంబ‌రులో ఖాళీ కానున్న గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం స‌మాచార క‌మిష‌న‌ర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి, క‌రీంన‌గ‌ర్ గ్రంథాల‌య సంస్థ చైర్మెన్ స‌త్తు మ‌ల్లేశం పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -