Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయంమోడీ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు

మోడీ ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ లో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు. పీఎం మోడీని రక్షించడానికి ప్రధాన్ ను రాజీనామా చేయించారని, పీఎం కోసం ప్రధాన్ రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు.జెన్ జీ ఉద్యమమే మోడీ సర్కార్ మెడలు వంచిందన్నారు.దేశంలో నీట్ పరీక్షల నుంచి సైనిక రిక్రూట్‌మెంట్ వరకు అన్ని పరీక్షలూ లీకవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ పేపర్లు, విరాళాల చోరీలు కామన్‌గా మారాయని, యాంటీ పేపర్ లీక్ బిల్లు పేరుతో ప్రభుత్వం మరోసారి డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.

విద్యార్థులు రోడ్డెక్కి పోరాటం చేసేవరకు విద్యామంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అవినీతి ఆరోపణలతో రాజీనామా చేసిన వ్యక్తికి పార్లమెంట్‌లో ఘనస్వాగతం పలకడం సిగ్గుచేటన్నారు. బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, అగ్నీవీర్ నియామకాల నుంచి యువతకు అందే ఉపాధి వరకు కేంద్రం చెబుతున్నవన్నీ అబద్ధాలేనని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -