నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జరిపిన సోదాలను వ్యతిరేకిస్తూ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులు, కార్యకర్తలు గురువారం చెన్నైలో ధర్నా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సంబంధించిన ప్రాంగణాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా ఒక అజెండా అమలు జరుగుతోందని విమర్శించారు. విజయన్ నివాసంపై జరిగిన దాడులను CPI(M) మధ్య చెన్నై జిల్లా కార్యదర్శి జి. సెల్వ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ED కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) వంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలను RSS, BJP దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విజయన్ సంబంధిత ప్రాంగణాల నుండి ఈడీకి ఎటువంటి కీలక సమాచారం లభించలేదన్నారు. ఈ దాడులు బీజేపీ-RSS అజెండాలో భాగమన్నారు.



