Thursday, May 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా దాడులు..ఇరాన్ ప్ర‌తిదాడులు

అమెరికా దాడులు..ఇరాన్ ప్ర‌తిదాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియాలో అమెరికా దాడులు చేసింది. హర్మూజ్‌ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యూఎస్‌ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ మేరకు అంత‌ర్జాతీయ‌ మీడియాలో కథనాలు వెలువ‌డ్డాయి. ఈ దాడి కారణంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా లేదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా.. హర్మూజ్ సమీపంలో యూఎస్‌ పదే పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది.

అదే విధంగా ఇరాన్ కూడా యూఎస్ సైనిక స్థావ‌రాల‌పై ప్ర‌తిదాడులు చేసింది. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా బేస్‌లను తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్‌జీసీ తెలిపింది. అయితే తమ గగనతలంపైకి క్షిపణులు, డ్రోన్‌లు దూసుకొచ్చాయని కువైట్ (Kuwait) దళాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -