Thursday, May 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'పెద్ది' పైరసీకి అడ్డుకట్ట.. హైకోర్టు ఉత్తర్వులు

‘పెద్ది’ పైరసీకి అడ్డుకట్ట.. హైకోర్టు ఉత్తర్వులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రానికి పైరసీ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర నిర్మాత దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ‘యాంటీ-పైరసీ ఇంజంక్షన్’ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ సినిమా కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయరాదని, అనధికారిక డౌన్‌లోడ్, స్ట్రీమింగ్ లింకులు కనిపించినా తక్షణమే బ్లాక్ చేయాలని సైబర్ సెల్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలతో చిత్ర బృందానికి ఊరట లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -