- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రానికి పైరసీ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తూ మద్రాస్ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. చిత్ర నిర్మాత దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ‘యాంటీ-పైరసీ ఇంజంక్షన్’ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, పైరసీ వెబ్‌సైట్లు, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఈ సినిమా కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయరాదని, అనధికారిక డౌన్‌లోడ్, స్ట్రీమింగ్ లింకులు కనిపించినా తక్షణమే బ్లాక్ చేయాలని సైబర్ సెల్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలతో చిత్ర బృందానికి ఊరట లభించింది.
- Advertisement -



