Thursday, July 30, 2026
E-PAPER
Homeఆటలుహర్మన్‌‌ప్రీత్‌‌కు పగ్గాలు..

హర్మన్‌‌ప్రీత్‌‌కు పగ్గాలు..

- Advertisement -

ఆసియా క్రీడలకు 
హాకీ జట్టు ప్రకటన
భువనేశ్వర్‌: ఆసియా క్రీడలకు 20మంది ఆటగాళ్లతో కూడిన జట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) బుధవారం ప్రకటించింది. హాకీ ఇండియా ప్రకటించిన జట్టుకు హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌కెప్టెన్‌‌గా ఎంపికయ్యాడు. ‌జపాన్‌‌లోని ఐచి-నగోయాలో జరిగే ఆసియా క్రీడల్లో భారతజట్టు పూల్‌-ఎలో చోటు లభించగా.. ఈ పూల్‌‌లో ఆతిథ్య జపాన్‌, కొరియా, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇండోనేషియా జట్లు ఉన్నాయి. డిఫెండింగ్‌ ‌ఛాంపియన్‌‌గా బరిలోకి దిగే భారతజట్టు సెప్టెంబర్‌ 20న ఇండోనేషియాతో తన తొలి మ్యాచ్‌‌ను ఆడనుంది. ఆ తర్వాత శ్రీలంక (సెప్టెంబర్ 22), కొరియా (సెప్టెంబర్ 24), జపాన్ (సెప్టెంబర్ 26), బంగ్లాదేశ్ (సెప్టెంబర్ 28) లతో మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం 12జట్లు స్వర్ణ పతకం కోసం పోటీపడనున్నాయి.

జట్టు.. గోల్‌‌కీపర్లు: మోహిత్‌, సూరజ్‌ ‌కర్కేరా
డిఫెండర్లు: జర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, హర్మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌(‌కెప్టెన్‌), అమిత్‌ ‌రోహిదాస్‌, జుగ్‌‌రాజ్‌ ‌సింగ్‌, సంజయ్‌, సుమిత్‌, యశ్‌‌దీప్‌.
మిడ్‌‌ఫీల్డర్లు: రాజిందర్‌ ‌సింగ్‌, రాజ్‌ ‌కుమార్‌ ‌పాల్‌, హార్దిక్‌ ‌సింగ్‌, మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, నీలకంఠ శర్మ, వివేక్‌ ‌సాగర్‌ ‌ప్రసాద్‌
ఫార్వర్డ్స్‌: దిల్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, షీలానంద్‌ ‌లక్రా, సుఖ్‌‌జీత్‌ ‌సింగ్‌, మన్‌‌ప్రీత్‌ ‌సింగ్‌, అభిషేక్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -