సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు
చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
సీపీఐ(ఎం) నాయకులు, చర్లపల్లి మాజీ సర్పంచ్ వంగరి సత్తయ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని చర్లపల్లిలో వంగరి సత్తయ్య మృతదేహాన్ని గురువారం ఉదయం వారు సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సత్తయ్య చిన్ననాటి నుంచి పేదల పక్షాన నిలిచారని, అనేక పోరాటాలు నిర్వహించారని కొనియాడారు. సర్పంచిగా, ఎంపీటీసీగా చర్లపల్లి గ్రామ అభివృద్ధికి ఎంతో సేవ చేశారన్నారు. ప్రజలు ఎక్కడ సమస్యతో బాధపడుతున్నా ఎర్రజెండా భుజానేసుకుని ప్రత్యక్షంగా పోరాటాలు నిర్వహించి.. అనేక మందికి భూమి పంపిణీ, ఇండ్లు ఇప్పించడంలో కృషి చేశారని తెలిపారు. చేనేత కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రజలందరి సమస్య మీద పనిచేసేవారని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నాయకులు ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఊట్కూరు నారాయణరెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, అవుట రవీందర్, దండెంపల్లి సరోజ, గుండాల నరేష్, బొల్లు రవీందర్, కడారి నరసింహ, కర్నాటి శ్రీరంగం, గౌరీదేవి మధుసూదన్, గంజి రాజేష్, కత్తుల యాదయ్య , లకపాక రాజు, రాపోలు చంద్రయ్య పాల్గొన్నారు.
సత్తయ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



