Friday, May 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎంఎస్‌పీ ధరల జీవో ప్రతులు దహనం

ఎంఎస్‌పీ ధరల జీవో ప్రతులు దహనం

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ- విలేకరులు

రైతులు పండించిన పంటలకు నష్టం కలిగే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పీ ధరల జీవోను వెనక్కి తీసుకొని సవరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం తెలంగాణ రైతు సంఘం, ఎస్‌కెఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జీవో ప్రతులను దహనం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణంలో ఎస్‌కెఎం ఆధ్వర్యంలో ఎంఎస్‌పీ ధరల జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్‌ కందాల ప్రమీల మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ ధరలకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న 500 రైతు సంఘాలను కలుపుకొని ఈనెల 31 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి, బహుజన రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి బొల్లికొండ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపి కేంద్రం జారీ చేసిన జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బంటు వెంకటేశ్వర్లు, ఏఐకేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వస్కుల మట్టయ్య మాట్లాడారు. నిజామాబాద్‌, కామారెడ్డి, తదితర జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -