Wednesday, August 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదర్శ పంచాయతీలుగా ఏజెన్సీ గ్రామాలు

ఆదర్శ పంచాయతీలుగా ఏజెన్సీ గ్రామాలు

- Advertisement -

అభివృద్ధిలో సర్పంచులు లీడ్ తీసుకోవాలి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఏజెన్సీ ప్రాంతాలను దేశానికే ఆదర్శంగా నిలిచే గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహి ల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఏజెన్సీ ప్రాం తాలకు చెందిన మహిళా సర్పంచులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమానికి సర్పంచులు నాయకత్వం వహించాలని పిలు పునిచ్చారు.
సాధారణ గ్రామపంచాయతీలకు, షెడ్యూల్డ్ ఏరియా గ్రామపంచాయతీలకు చాలా తేడా ఉంటుందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులు, అక్కడి ప్రజల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాల్సిన అవసరం ఉందన్నారు. పేసా చట్టం ద్వారా ఏజెన్సీ ప్రాంతాల గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పించారనీ, వాటిని సర్పంచులు పూర్తిగా అర్థం చేసుకొని ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని సూచించారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళిక రూపొందిం చుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు సొంత ఆదాయ వనరులను పెంచుకోవడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామసభలను కేవలం అధికారిక కార్యక్రమాలుగా కాకుండా బాల్య వివాహాలు, మహిళలపై వేధింపులు, పిల్లల విద్య, పోషకాహారం, ఆరోగ్యం వంటి సామాజిక అంశాలను పరిష్కరించే వేదికలుగా మార్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్‌ఆర్డీ డీజీ. శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, శిక్షణ కార్యక్రమ కోఆర్డినేటర్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -