అర్థరాత్రి అధికారుల చర్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్
నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మ దహనం
బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
1500మంది పోలీసుల మోహరింపు
నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత, నేడు బంద్‌కు పిలుపు
నవతెలంగాణ -నర్సంపేట
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేతపై బీఆర్‌ఎస్ భగ్గుమంది. వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణాంతరం పట్టణంలోని వైద్య కళాశాలకు ఎదురుగా ఓ ప్రయివేటు వ్యక్తికి చెందిన స్థలంలో అతని సమ్మతితో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం స్థాపించారు. కాగా, అదే రోజు అర్థరాత్రి అధికారులు కూల్చారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదే స్థలంలో తిరిగి ప్రతిష్టించారు. అప్పటి నుంచి విగ్రహం వద్ద పోలీసులు పహారా కాచారు. ఈ నెల 17న అర్థరాత్రి ఆర్డీఓ పి.ఉమారాణి, ఏసీపీ రవీందర్‌రెడ్డి, తహసీల్ధార్ రవిచంద్రా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్.. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం వద్దకెళ్లి బుల్డోజర్లతో కూల్చేసే చర్యలు చేపట్టారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేనందున కూల్చివేశామని అధికారులు చెప్పారు. వందల మంది పోలీసులను మోహరించి అర్థరాత్రి కూల్చడం వెనుక రాజకీయ కుట్ర ఉందని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహం కూల్చేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజవర్గ అభివృద్ధికి విశేషంగా పాటుపడిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని దొంగళ్లా అర్థరాత్రి కూల్చడం దుర్మార్గం అంటూ మండిపడ్డారు. కాగా నియోజవర్గంలోని ఆరు మండలాల బీఆర్‌ఎస్ నాయకులను కార్యకర్తలను మంగళవారం తెల్లవారుజామున ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేసి వివిధ పోలిస్ స్టేషన్‌లకు తరలించారు. నర్సంపేట ప్రధాన రహదారులపై, వైద్య కళాశాల ఎదుట కూల్చేసిన విగ్రహ ప్రదేశం లో పోలీసులు భారీగా మోహరించారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల చర్యలను బీఆర్‌ఎస్ నాయకులు తప్పుపట్టారు. రాజకీయ కుట్రలో భాగమే పెద్ది విగ్రహన్ని కూల్చేశారని, ఇందులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హస్తం ఉందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త తక్కెళ్లపెల్లి రవీందర్ రావు ఆరోపించారు. తిరిగి యధాతదంగా అదే స్థలంలో పెద్ది విగ్రహాన్ని ప్రభుత్వమే ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ సెంటర్ లో బీఆర్‌ఎస్ నాయకురాలు దార్ల రమాదేవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గురిజాల క్రాస్ వద్ద నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారులపై రాస్తారోకో చేపట్టారు. ఖానాపురం మండల కేంద్రంలో 365-జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అక్కడ కూడా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్ది విగ్రహన్ని కూల్చినందుకు నిరసనగా బీఆర్‌ఎస్ బుధవారం జిల్లా బంద్‌కు పిలుపు నిచ్చింది.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



