బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ వేయొద్దని ఆపింది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం వల్లే హైకోర్టు ఆ పథకాన్ని నిలిపేసిందని విమర్శించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు, మహాలక్ష్మి వంటి పథకాలను కూడా ఆపే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి ఇచ్చిన 18005994788 నెంబర్ టోల్ ఫ్రీ కాదనీ, టోల్ ఫీ నెంబర్ అని అన్నారు. 22ఏ పేరుతో నిషేధిత భూముల జాబితా అనేది దేశంలోనే పెద్ద భూ కుంభకోణమని విమర్శించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సుమిత్రానంద్, చారులత ,కల్వకుర్తి శ్రీనివాస యాదవ్, రాంచంద్రనాయక్, తుంగబాలు, మమత తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మిపై కౌంటర్ అఫిడవిట్ వద్దన్నది సీఎం రేవంత్‌రెడ్డే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



