- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలోని మీర్జా గాలిబ్ స్ట్రీట్‌లో అర్ధరాత్రి ఒక హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారంతా వైద్య చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పౌరులుగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
- Advertisement -



