- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పంజాబ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. పంజాబ్లోని 102 నగర పాలక సంస్థలకు ఈ ఎన్నికలు జరుగగా, వీటిలో 8 మున్సిపాలిటీలు, 75 మున్సిపల్ కౌన్సిళ్లు, 19 నగర పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 1,869 వార్డులకు గాను శుక్రవారం రాత్రి వరకు వెలువడిన ఫలితాల్లో 939 వార్డులను ఆప్ కైవసం చేసుకుంది. మొత్తం మున్సిపాలిటీల్లో సగానికి పైగా వార్డులను దక్కించుకుంది. 376 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచి రెండో స్థానంలో నిలిచింది. సాద్-189, బీజేపీ-167 స్థానాలు గెలుచుకున్నాయి. బీఎస్పీ 7 వార్డులు దక్కించుకుంది.
- Advertisement -


