- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్ పోర్టల్‌ను మే 29 శుక్రవారం లాంచ్ చేయాల్సి ఉండగా.. దాన్ని జూన్ 1కి సీబీఎస్‌ఈ వాయిదా వేసింది. కచ్చితమైన సమాచారంతో పాటు క్రాష్ కాకుండా పోర్టల్‌ను డిజైన్ చేస్తున్నామని, అందుకే ఆలస్యం అయిందని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు.
17 లక్షల మందికి సంబంధించిన 98 లక్షల ఆన్సర్ షీట్లు భద్రంగా ఉన్నాయని సీబీఎస్‌ఈ చెప్పింది. రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న స్టూడెంట్లకు మాత్రమే ఈ పోర్టల్ జూన్ 1 నుంచి ఓపెన్ అవుతుందని అధికారులు తెలిపారు. కాగా పోర్టల్ వాయిదా వేయడంపై విద్యార్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -


