Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

- Advertisement -

సీఐటీయూ మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి కుంట్ల నాగన్న 
నవతెలంగాణ- నెల్లికుదురు 

ఈనెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి కుంట్ల నాగన్న  తెలిపారు. మండల కేంద్రంలోని విశ్రాంతిభవనంలో సిఐటియు దాని అనుబంధ సంఘాల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఆయన బిజెపి తెచ్చిన నాలుగు లేబర్ కోడులతో కార్మికులకు మరణ శాసనంగా ఉందని అట్టి వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసి ఉంటే తెలిపారు. 

విద్యుత్తు సవరణ చట్టం 2025 వి బి జి-రామ్ జి చట్టం. విత్తన సవరణ బిల్లు ఎల్ఐసి లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకరమైన నిర్ణయాలను ఉపసర్రించుకోవాలని కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపుమేరకు నెల్లికుదురు మండల కార్మిక వర్గం మొత్తం పాల్గొని సమ్మె ను జయప్రదం చేయాలని కోరారు. మన కార్మిక హక్కుల కోసం పోరాడి సాధించుకుంటే నేడు బిజెపి ప్రభుత్వం వాటిని ప్రక్కన పెట్టి మనల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి కోడలు తేవడం సరికాదని అన్నారు.

కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి పెరుమాండ్ల బాబు గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు, బత్తిని వెంకన్న, గుగులోతు హనుమంతు, హెచ్ వెంకన్న,  ఐలేష్ ,ఉప్పలయ్య, రవి, సంపత్, కొమురయ్య, వెంకటలక్ష్మి, వీరలక్ష్మి, దస్తగిరి, ప్రసాద్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -