- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ కారు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించిన సమాచారం శనివారం సాయంత్రం వరకు తెలియకపోవడం ఈ ఘటనలోని తీవ్రతను తెలియజేస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి కారును గుర్తించారు.
- Advertisement -


