Friday, July 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగాయత్రీ దేవి పాత్రలో..

గాయత్రీ దేవి పాత్రలో..

- Advertisement -

సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సుధీర్స్ జోకర్. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిం చనున్నారు. అందరి ప్రశంసలు అందుకున్న 'పరదా లాంటి విభిన్నమైన చిత్రం తర్వాత ఆనంద మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం మేకర్స్ ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో నటి అభిరామి నటిస్తున్నట్లు ప్రకటించారు. గాయత్రీ దేవి పాత్రలో ప్రేక్షకుల్ని ఆమె అలరించనున్నారు. ‘అమ్మకు ఇచ్చిన మాట చిరకాలం మిగిలిపోతుంది..’ అంటూ ఈ పోస్టర్ పై రాసిన క్యాప్షన్ కథలో ఉన్న డెప్త్ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -