డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈనెల 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శాలిని కొండెపుడి మీడియాతో ముచ్చటించారు.
ఇంతకుముందు నేను జయమ్మ పంచాయితీ, శుభం, మై డియర్ దొంగ చిత్రాలు చేశాను. తెలిసిన వారి ద్వారా ఈ సినిమాలో ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఉందని తెలిసింది. సింగీతం సినిమా అంటే ఎలాంటి పాత్ర అయినా చేయాలని నిర్ణయించుకుని, ఆడిషన్‌కి వెళ్లాను. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఇందులో శక్తివంతమైన విలన్ పాత్రని పోషించాను. ఇలాంటి జోనర్‌లో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఈ సినిమాలో ప్రతీదీ మ్యూజికల్ గా ఉంటుంది. ప్రతి ఆర్టిస్ట్‌కి కొంచెం శృతిలో పాడటం రావాలి. ఇందుకోసం చాలా వర్క్‌షాప్స్ చేశాం. ఈ కథ ఆలోచన సింగీతంకి చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. అయినప్పటికీ ఈ రోజుకీ ఎంతో రిలెవెంట్‌గా అనిపించే కథ ఇది. ఇందులో ప్రతి మాట మ్యూజికల్‌గా ఉంటుంది. సంభాషణలు కూడా పాటల్లా సాగు తాయి. ఈ కథ ‘కుబేరపురం’ అనే ఒక ఫిక్షనల్ గ్రామంలో జరుగు తుంది. ఆ ఊరిలో ఏమి జరుగు తుంది? ఎందుకు అందరూ పాటల రూపంలో మాట్లాడతారు? అనేది థియేటర్‌లో చూసి ఆస్వాదిం చాల్సిందే. ఇటీవల విడుదలైన పాట ద్వారా ప్రేక్షకులకు సినిమా టోన్‌పై కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే అందరూ మాటలను పాటల్లా ఎందుకు పాడుతున్నారు?, దాని వెనుక కారణం ఏమిటి? అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఇది అలరించే మంచి సినిమా.
అదేఈ సినిమా ప్రత్యేకత..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



