Wednesday, June 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపరకాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

పరకాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

- Advertisement -

పెట్రోల్ బాటిళ్లతో బాధితుల ఆత్మహత్యాయత్నం
నవతెలంగాణ – పరకాల

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మాధారం గ్రామానికి చెందిన తమ వారసత్వ భూమిని కబ్జా చేసేందుకు జరుగుతున్న యత్నాలను అడ్డుకోవాలని, ఈ వ్యవహారంలో తహసీల్దార్ విజయలక్ష్మి అక్రమ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ మంగళవారం పరకాల తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని హెచ్చరిస్తూ, పెట్రోల్ బాటిళ్లతో కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్లాల శ్రీనివాస్, నల్లాల శ్రీధర్, నల్లాల రవీందర్, నాగుర్ల చిన్న వీరన్న, షమీమ సుల్తానా, ఆకుల రాంబాబు, కానుగంటి రమాదేవి, గంధం శ్రీనివాస్ తదితర బాధితులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

ఈ భూ వివాదం 2011వ సంవత్సరం నుండి కోర్టులో నడుస్తోందని బాధితులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, తహసీల్దార్ అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడంలో భారీగా అక్రమాలు జరిగి ఉంటాయని బాధితులతో పాటు స్థానికంగా పలువురు ఆరోపిస్తున్నారు. నల్లాల ఎర్ర నర్సయ్య వారసులు మరియు భూమి కొనుగోలుదారులు మాట్లాడుతూ, సర్వే నెంబర్ 665లోని తమ భూమిని గండ్ర సాయిరెడ్డి, పనునూట లింగస్వామి, గండ్ర దిలీప్ రెడ్డిలు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

1953-54, 1963, 1964 మరియు 1978-79 నాటి రెవెన్యూ రికార్డులు తామే అసలైన యజమానులమని స్పష్టం చేస్తున్నాయని, అయినా అధికారులు బాధితుల మొర ఆలకించడం లేదని వారు మండిపడ్డారు. తమ భూమిని అక్రమార్కుల చెర నుంచి కాపాడి, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ బాధితులు ఆందోళన కొనసాగించారు.ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి వివరణ కోరగా బాధితులుగా చెప్పుకుంటున్న వారివద్ద సరైన ఆదారాలు లేవని తెలిపారు. మరోవైపు బాధితులు తమ వద్ద అన్ని ఆధారాలను తాసిల్దార్ కు సమర్పించగా తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందులోనే తాసిల్దార్ కార్యాలయంలో ఏం జరిగిందనేది చెప్పకనే చెప్పినట్లు స్పష్టమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -