Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు మార్కెట్లో ధాన్యం కొనుగోలు పూర్తి

ఆలేరు మార్కెట్లో ధాన్యం కొనుగోలు పూర్తి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
ఆలేరు వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఎఫ్ పి ఓ, ధాన్యం కొనుగోలు పూర్తయిందని, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ఐనల చైతన్య మహేందర్ రెడ్డి, ఆలేరు తహసిల్దార్ వి ఆంజనేయులు వేరువేరుగా బుధవారం నవతెలంగాణతో మాట్లాడుతూ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు తాసిల్దార్ వి ఆంజనేయులు,  మార్కెట్ సెక్రటరీ  పద్మజ, డైరెక్టర్లతో కలిసి  ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ధాన్యం కొనుగోలు పూర్తయ్యేందుకు సమన్వయంతో పనిచేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆలేరు, తుర్కపల్లి ,రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు , మండలాలల పరిది 69 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రారంభించామని, కొన్ని సెంటర్లలో ధాన్యం కొనుగోలు పూర్తయిందని, మరికొన్ని సెంటర్లలో ధాన్యం కొనుగోలు సెంటర్లలో ప్యాడి క్లీనర్ , వేయింగ్, మ్యాచర్ మిషన్ లు,టార్ ఫాలింగ్ లకి ఎక్కడ లోటు లేకుండా చూసామని చెప్పారు.

లారీల కొరత లేకుండా ప్రత్యేకంగా తహసిల్దారు, ఆలేరు మార్కెట్ను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పని చేశారని అభినందించారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరిగిందని తెలిపారు. దీనికి మార్కెట్ కమిటీ నుండి పూర్తి సహకారం అందించామన్నారు. ఇప్పటివరకు 431 మంది రైతులు మార్కెట్కు ధాన్యం తీసుకువచ్చారని,  పూర్తిస్థాయిలో రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 80 లారీలు, 20 డీసీఎంల ద్వారా మిల్లర్లకు, 78,వేల 361బస్తాలు ఎగుమతి చేశామన్నారు. మొత్తం 31 ,344, 40 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకి తరలించడం జరిగిందన్నారు. మార్కెట్ వచ్చే చివరి  ధాన్యం  గింజ  వరకు కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు సహకరించిన మీడియా సోదరులకు అమాలి కార్మికులకు లారీ యజమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -