Wednesday, June 3, 2026
E-PAPER
Homeజిల్లాలుపేద విద్యార్థి వైద్య విద్యకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే మర్రి

పేద విద్యార్థి వైద్య విద్యకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే మర్రి

- Advertisement -

నవతెలంగాణ-తాడూర్ 
పేద విద్యార్థి వైద్య విద్యకు అండగా ఉంటామని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 20వ వార్డుకు చెందిన గౌతమ్ సాయికి బుధావారం ఆయన రూ.75 వేల ఎంజేర్ చారిటబుల్ ట్రస్ట్ చెక్కును విద్యార్థి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత విద్యకు దూరం కాకూడదని అన్నారు.  ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నిరంతరం సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్యా కోర్సులకు భవిష్యత్తులోనూ తనవంతు  సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్థిక సాయం అందుకున్న గౌతమ్ సాయి, కుటుంబ సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం మర్రి జనార్దన్ రెడ్డి సేవలు ఎనలేనివని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -