నవతెలంగాణ-హైదరాబాద్: వెనిజులా తాత్కాలిక అధ్యక్షరాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం భారతదేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధాని నరేంద్రమోడీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సహా ఇతర నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈమె పర్యటన జూన్ 3- 7 వరకు కొనసాగుతుందని విదేశాగ మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది.
కాగా, వెనిజులా అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్, ప్రధాని మోడీలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోనున్నారు. ప్రధానంగా భారత్- వెనిజులాల మధ్య సంబంధాలను సమీక్షించుకోనున్నారు. అలాగే ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొంచుకునేందుకు చర్చలు జరగనున్నాయి అని భారత విదేశాంగ ప్రకటన పేర్కొంది.
డెల్సీ రోడ్రిగ్జ్ భారత్ పర్యటన ఇది ఆరవ సారి. విదేశాంగ మంత్రిగా 2015లో, ఉపాధ్యక్ష పదవి హోదాలో 2019, 2023, 2024, 2025లో పర్యటించారు. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలి హోదాలో ఆరవ సారి భారత్‌లో పర్యటించనున్నారు.



