తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం‘సర్కారు బాయి’.
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి లారా దర్శకత్వం వహిస్తుండగా, తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మిస్తున్నారు. తెలంగాణలో 80 దశకంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ,నీటి సమస్య అనేది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి కీలకమైన అంశాన్ని కథాంశంగా తీసుకుని సినిమా రూపొందించడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సినిమాలో నటించిన హీరోయిన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నానుఅని అన్నారు. 'ఈ చిత్ర కథాంశం చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ప్రేక్షకులు కంటెంట్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి కథతో వచ్చే సినిమాలను ఆదరిస్తున్నారు. ఇలాంటి సబ్జెక్టులతో సినిమాలు నిర్మించే నిర్మాతలు ఉండటం పరిశ్రమకు గొప్ప విషయం అని తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య చెప్పారు. హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ, ‘నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన దర్శకుడు లారాకి కృతజ్ఞతలు. నిర్మాత ప్రఫుల్ రాంరెడ్డి మాకు కుటుంబ పెద్దలాంటివారుఅని అన్నారు. 'ఈ కథ విన్న వెంటనే ఇది జాతీయ అవార్డు స్థాయి సినిమా అవుతుందనే నమ్మకం కలిగింది అని హీరోయిన్ వర్షిక తెలిపారు. దర్శకుడు లారా మాట్లాడుతూ, ‘చరిత్రలో మరుగున పడిపోయిన ఓ భావోద్వేగ కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ‘సర్కారు బాయి’ వద్ద అణగారిన వర్గాలకు నీళ్లు ఇవ్వకుండా జరిగిన అన్యాయాలు, వారు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటి గాథ ఈ చిత్రానికి మూలకథ. 1985లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు, కుల వివక్ష, సామాజిక అసమానతలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. తెలంగాణలో జరిగిన ఓ హృదయ విదారక సంఘటనను తెరపై ఆవిష్కరిస్తున్నాంఅని తెలిపారు. 'నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సమాజానికి సందేశాన్ని అందించే ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని నమ్ముతున్నాను. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం అని నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి చెప్పారు.
వాస్తవభా వోద్వేగ కథతో’సర్కారు బాయి`
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



