హీరో రవితేజ ‘ఇరుముడి’ చిత్రంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధంగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కమర్షియల్ యాక్షన్‌కు భావోద్వేగాలను జోడిస్తూ రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో ఒక కామన్ మ్యాన్ ప్రపంచాన్ని ఆకట్టుకునేలా చూపించారు. తన కూతురే అతని ప్రపంచం. ఆమె ఆనందం కోసం తీసుకునే నిర్ణయాలే అతని జీవితాన్ని నడిపిస్తాయి. తండ్రీ-కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎంతో సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఈ గ్లింప్స్‌లో ఆవిష్కరించారు. ఈ గ్లింప్స్‌లో మరో ప్రత్యేక ఆకర్షణ రవితేజ పాత్రలో కనిపించే ట్రాన్స్ఫర్మేషన్. అయ్యప్ప దీక్ష స్వీకరించిన తర్వాత ఆయన పాత్రలో చోటుచేసుకునే మార్పు ఎంతో హృద్యంగా చూపించారు. అది కేవలం ఒక త్యాగంలా కాకుండా, తన కూతురిపై ప్రేమతో, భక్తితో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. చివర్లో కనిపించే ఇరుముడి విజువల్స్ భావోద్వేగాన్ని మరింత పెంచి ప్రేక్షకుల మనసులను తాకాయి. శివ నిర్వాణ మరోసారి తన బలమైన ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్‌తో ఆకట్టుకున్నారు. సహజమైన భావోద్వేగాలతో తండ్రీ-కూతుళ్ల బంధాన్ని కథకు ప్రధాన బలంగా మలిచారు. ఆ అనుబంధం ఎంతో సహజంగా అనిపించడం వల్ల ప్రేక్షకులు పాత్రలతో వెంటనే కనెక్ట్ అవుతున్నారు. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఆకట్టుకుంది. ఆమె, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అని మేకర్స్ అన్నారు.
తండ్రీకూతుళ్ల అనుబంధానికి ప్రతీక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



