Monday, February 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త హర్రర్‌ థ్రిల్లర్‌

సరికొత్త హర్రర్‌ థ్రిల్లర్‌

- Advertisement -

శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్‌, సుప్రిత, హరీష్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా ‘అమరావతికి ఆహ్వానం’. డైరెక్టర్‌ జీవీకే తెరకెక్కించారు. నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్‌ సమర్పణలో లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ బేనర్‌పై కేఎస్‌ శంకర్‌రావు, ఆర్‌ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దసపల్లా హోటల్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నటులు, నిర్మాత మురళీ మోహన్‌, హీరో అశ్విన్‌ బాబు హాజరయ్యారు.

నిర్మాత ఆర్‌. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,’ఇవాళ అమరావతికి ఎంతో ఖ్యాతి వస్తోంది. అలాంటి నగరం పేరుతో మేము హర్రర్‌ మూవీ చేశాం. మాకు ఈ చిత్రంతో సక్సెస్‌ దక్కుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు ట్రైలర్‌ చూశాక మరింత పెద్ద హిట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాం’ అని తెలిపారు. ‘టైటిల్‌ చూసి ఇదోదే పొలిటికల్‌ మూవీ అనుకుంటున్నారు. కాదు.. ఇందులో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. రెండున్నర గంటలు మిమ్మల్ని ఎంటర్‌ టైన్‌ చేసే హర్రర్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది’ అని డైరెక్టర్‌ జీవీకే చెప్పారు. హీరో శివకంఠంనేని మాట్లాడుతూ,’సినిమా బాగా వచ్చింది. ఫస్ట్‌ కాపీ చూసుకున్నాం. ప్రేక్షకులకు రీచ్‌ అయ్యేలా ప్రమోట్‌ చేస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్‌కు మేము గ్యారెంటీ ఇస్తున్నాం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -