Friday, June 5, 2026
E-PAPER
Homeసినిమాపొల్లాచ్చిలో కీలక షెడ్యూలు షురూ..

పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు షురూ..

- Advertisement -

అగ్ర కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో రూపొందుతున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలు భాషల్లో భారీ విజయాలు అందుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా యూనిట్ విడుదల చేసిన స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు బాబీ కొల్లి మరింత భారీ స్థాయిలో కథను సిద్ధం చేశారు. దశాబ్దాలుగా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి ఈ చిత్రంలో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు అని మేకర్స్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -