Thursday, June 4, 2026
E-PAPER
Homeసినిమాదుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన 'సిగ్మా స్టైల్`

దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన ‘సిగ్మా స్టైల్`

- Advertisement -

సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు అని చిత్ర బృందం తెలిపింది. తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ ను లాంచ్ చేశారు. తమన్ స్వయంగా కంపోజ్ చేసి, ఆలపించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ మాస్ బీట్‌లతో అదిరిపోయింది. తమన్ సిగ్నేచర్ స్టైల్ మ్యూజిక్, హై-వోల్టేజ్ రిథమ్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందీప్ కిషన్ తన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, ఫారియా అబ్దుల్లా కూడా అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్‌తో పాటకు మరింత కలర్ తీసుకొచ్చింది. జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్, తమన్ మాస్ ట్యూన్, సందీప్-ఫారియా డైనమిక్ పెర్ఫార్మెన్స్ కలిసి ‘సిగ్మా స్టైల్’ను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ఈ సాంగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ, ఎక్స్‌పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్ర యూనిట్ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -