- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్: మండల కేంద్రానికి చెందిన బొమ్మెడి లక్ష్మి – బొమ్మేడి సంజీవ్ ల కుమారుడు బొమ్మేడి రాకేష్ గత 15సంవత్సరాలుగా భారతనౌకదళంలో దేశ సేవ చేసి విరమణ పొందిన సందర్భంగా గ్రామస్థులు సోమవారం స్థానిక గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ సముద్ర సరిహద్దులను కాపాడుతూ, నిరంతరం దేశ భద్రతకు కాపలాగా నిలుస్తున్న భారత నౌకాదళ వీర జవాన్లు వారి త్యాగం, ధైర్యం, కర్తవ్యనిష్ఠతో భారత గౌరవాన్ని కాపాడుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పరచ సాయన్న, ఉప సర్పంచ్ శారద, వార్డు సభ్యులు, నాయకులు డుబ్బుల చంద్ర శేఖర్, జల్కే పాండురంగ్, ప్రశాంత్, శివుడు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



