Friday, June 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల రాస్తారోకో

ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల రాస్తారోకో

- Advertisement -


కాంటాలు వేయడం లేదని ఆవేదన
నవతెలంగాణ-రాయపోల్

వర్షాకాలం ప్రారంభమవుతున్నా… ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి, వీరనగర్ గ్రామాలకు చెందిన రైతులు గురువారం గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా.. కాంటాలు వేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పెద్దఎత్తున ధాన్యం నిల్వ ఉండగా, లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపు నిలిచిపోయిందన్నారు. కాగా, రాస్తారోకో సమాచారం అందుకున్న రాయపోల్ ఎస్‌ఐ మానస ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ రైతులు నిరసనను కొనసాగించారు. అనంతరం తొగుట సీఐ లతీఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని సాయంత్రంలోగా ఐకేపీ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపించి ధాన్యం తరలింపు ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దాంతో రైతులు రాస్తారోకోను విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -