- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. వనం చంద్రకళ (45), తన మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)తో కలిసి ఒక పెంకుటింట్లో నివసిస్తున్నారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించడంతో ఆ ముగ్గురూ బయటకు రాలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -



