Friday, June 5, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో మ‌రో అగ్ని ప్ర‌మాదం

ఢిల్లీలో మ‌రో అగ్ని ప్ర‌మాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఢిల్లీ సమీపంలో నోయిడాలో సెక్టార్-75లో ఉన్న ఐవీ కౌంటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ 12వ అంతస్తులో మంటలు చెలరేగడంతో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, బుధవారం ఢిల్లీలో ఫ్లరిష్‌ స్టే బెడ్ అండ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ హోటల్‌లో మంటలు చెలరేగిన ఘటనలో 21 మంది మృతి చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -