Friday, June 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగాంధీ ఆస్పత్రిలో రెండుకు చేరిన‌ ఎబోలా కేసులు

గాంధీ ఆస్పత్రిలో రెండుకు చేరిన‌ ఎబోలా కేసులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ఎబోలా వ్యాధి కేసులు రెండుకు చేరాయి.బోలా తరహా ప్రాథమిక లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులను రాత్రికి రాత్రే హైదరాబాద్‌లోని అపోలో ప్రైవేట్ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎబోలా లక్షణాలున్న ఇద్దరూ సూడాన్‌ నుంచే వచ్చినట్టు వైద్యులు తెలిపారు. మహమ్మద్‌ నగరంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిని గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ వార్డుకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -