నవతెలంగాణ-హైదరాబాద్: మూడవసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రెపోరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేట్లలో ఎటువంటి మార్పు లేదని, 5.25శాతం వద్ద యథాతథంగా ఉంచి తటస్థ ద్రవ్య విధాన వైఖరిని కొనసాగిస్తున్నట్లు ఆర్బిఐ పేర్కొంది. కీలక వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది మూడవసారి. ద్రవ్యవిధాన కమిటీ సమావేశ వివరాలను ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితి దశను కేంద్రం సమర్థవంతంగా అధిగమించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి సంక్షోభ సమయాలతో పోలిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ప్రపంచ సంక్షోభ దశలోకి బలమైన పునాదులతో ప్రవేశించిందని, ఈ ఓడిదుడుకులను కనీస నష్టంతో ఎదుర్కోగలమన్న విశ్వాసంతో ఉన్నామని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ లో జరిగిన సమీక్షల్లోనూ వడ్డీరేట్లను ఆర్బిఐ యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే.
మరోసారి వడ్డీరేట్లు యథాతథం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



