భారత స్వాతంత్య్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న చిత్రం ‘విప్లవ వీరుడు’. నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి జంటగా ఎస్.నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంద్రజపై ముహూర్తపు క్లాప్ కొట్టి ఆరంభించారు. ఇంద్రజ మాట్లాడుతూ,”స్వాతంత్య్రం కాలం నాటి కథను చాలా సహజంగా తెరకెక్కిస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా స్వాతంత్య్ర పోరాటంలో ఎలా పాల్గొన్నారు అనే అంశాన్ని చూపించబోతున్నాం. ఒక సామాన్యుడు విప్లవ వీరుడిగా మారి స్వతంత్ర ఉద్యమంలో వీరోచితంగా పోరాడే కథ ఇది. ఈ చిత్రంలో నేను రాణి భవానిదేవి పాత్రలో కనిపించబోతున్నాను.
బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కొన్నామన్నదే కథాంశం. అర్థవంతమైన కథతో నిర్మాత జయరాం మంచి సినిమా నిర్మిస్తున్నారు’ అని తెలిపారు. ‘విప్లవ వీరుడు పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ఈ పాత్ర నాకు ఎంతో ప్రత్యేకం. సినిమా చరిత్రలో నిలిచిపోతుంది’ అని హీరో జైశ్వర్ చెప్పారు. హీరోయిన్ సోనాలి మాట్లాడుతూ, ‘నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా’ అని తెలిపారు. దర్శకుడు ఎస్ నాగరాజు రావు మాట్లాడుతూ,’ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. బ్రిటీష్ కాలం నాటి హిస్టారికల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇందులో ఇంద్రజ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు’ అని అన్నారు. ‘టిప్పు సుల్తాన్ కాలం నాటి కథ ఇది. బ్రిటిష్ వారు వ్యాపారం పేరుతో దేశాన్ని ఎలా దోచుకున్నారో?, ఆ పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. మంచి సందేశం ఇచ్చే సినిమా అవుతుంది’ అని నిర్మాత ఏవీ జయరాం చెప్పారు.
సామాన్యుడు ‘విప్లవ వీరుడు’గా మారితే?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



