Sunday, June 7, 2026
E-PAPER
Homeఆటలుఆఫ్టన్ తో ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ఆధిక్యం

ఆఫ్టన్ తో ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ఆధిక్యం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 564/8 భారీ స్కోరును ఆఫ్ఘాన్ ముందుంచింది. అనంతరం శుభ్ మన్ గిల్ సేన బౌలింగ్‌లోనూ చెలరేగి ఆఫ్ఘన్ జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత జట్టు కంటే ఇంకా 451 పరుగులు వెనుకబడి ఉంది. అరంగేట్రం చేసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు.

తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలో దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఆదిలోనే తడబడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, రహ్మత్ షా (43 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదితో కలిసి 36 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, ప్రసిద్ధ్ కృష్ణ అతడిని ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. రేపు ఆటకు మూడు రోజు కాగా, ఆఫ్ఘన్ జట్టును వీలైనంత త్వరగా ఆలౌట్ చేయాలని టీమిండియా భావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -