Monday, July 27, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలి

- Advertisement -
  • విద్యార్థులపై లాఠీచార్జీ వ్యతిరేకిస్తూ పార్లమెంట్ వద్ద విపక్షాల ఆందోళన

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ ను వ్యతిరేకిస్తూ సీజేపీ శ్రేణులు జంతర్ మంతర్ వద్ద ఈనెల 20న భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. ఎలాంటి హెచ్చరికలు లేకుండా పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. విచక్షణారహితంగా యువతలను చితికబాదారు. భాష్పవాయువుతో పాటు పోలీసులు పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పెల్లెట్ గన్స్ తాకి పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తాజాగా విద్యార్థులపై దమనకాండను వ్యతిరికేస్తూ పార్లమెంట్ వద్ద ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అకారణంగా విద్యార్థులపై లాఠీచార్జీ చేశారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా సాగుతున్న యువత నిరసనaపై పోలీసుల దాడులు సమంజసంకాదని విపక్షాలు మండిపడ్డాయి. అంతేకాకుండా విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని, వెంటనే ఆ కేసులు ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -