Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబిర్యానీ చుట్టూ తిరిగే ‘అమీర్ లోగ్'

బిర్యానీ చుట్టూ తిరిగే ‘అమీర్ లోగ్’

- Advertisement -

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ‘అమీర్ లోగ్ ‘ సినిమాకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఎంసి హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ మూవీని ఈ నెల 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రధాన పాత్రధారులు ఎంసి హరి, మనోజ్, శశిధర్ చిత్ర విశేషాల గురించి మాట్లాడుతూ,’సినిమా ఎంతో నేచురల్‌గా ఉంటుంది. సినిమాని చూసినట్టుగా ఉండదు. హైదరాబాద్ బస్తీలోకి వెళ్లినట్టుగా, ఆ బస్తీల్లో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సింక్ సౌండ్‌లో ఈ మూవీని చేశాం. మేం బస్తీల్లోనే పెరిగాం. తెలంగాణ యాస, బస్తీ లైఫ్ కథ అవ్వడంతో మాకు చాలా సులభంగా మారింది. మా పాత్రలు రియల్ లైఫ్ కారెక్టర్స్‌కి దగ్గరగా అనిపించాయి. రమణ ఎంతో నేచురల్‌గా, ఎంతో సింపుల్‌గా సినిమాని తీశారు. ఈచిత్రంలో బిర్యానీ అనేదే మెయిన్ పాయింట్. ఆ బిర్యానీ చుట్టూనే మా పాత్రలు తిరుగుతాయి. అది ఏంటి అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని చూస్తే బిర్యానీ వాసన వస్తుంది. సెకండాఫ్‌లో బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. క్లైమాక్స్‌కి కడుపు నిండినట్టు అనిపిస్తుంది. తెరపై మేం ముగ్గురం ఎక్కువగా కనిపించినా.. మా సినిమాలో మహిళా పాత్రలే కీలకంగా ఉంటాయి. అమ్మానాన్నలు, అక్క, అన్న, వదిన, పక్కింటి పాత్రలు ఇలా అన్ని కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా, అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -