Wednesday, February 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఓటు అనేది ఆయుధం: మంత్రి పొన్నం

ఓటు అనేది ఆయుధం: మంత్రి పొన్నం

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ లో ఓటు అనేది ఒక  ఆయుధమని పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బుధవారం  హుస్నాబాద్ నవ భారత్ హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ వినియోగించుకున్నారు.ఈ4 సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారు..అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉందన్నారు. 116 మున్సిపాలిటీ లు ,7 కార్పొరేషన్ లలో ప్రతి అర్బన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్ననని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణ తో ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధి నీ ఎన్ను కోవాలని అన్నారు.

ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవించి ఉన్నట్లు కాదని నానుడి చెప్తారని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోండి ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -