- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీలో పెద్ద మొత్తంలో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగాయి. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. భయంతో ఒక్కసారిగా కార్మికులు, ఉద్యోగులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -



