Monday, June 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌‎పై దాడులకు ఇరాన్ బ్రేక్

ఇజ్రాయిల్‌‎పై దాడులకు ఇరాన్ బ్రేక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియాలో కాల్పుల మోత‌కు బ్రేక్ ప‌డింది. ఇజ్రాయిల్‌‎పై దాడులు ఆపేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, తమ మిత్రపక్షమైన లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగితే మాత్రం తీవ్రమైన దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మిస్సైళ్లు, బాంబుల మోతతో దద్దరిల్లిన పశ్చిమాసియాలో ఇరాన్ తాజా ప్రకటనతో శాంతి వాతావరణం ఏర్పడింది.

ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులతో విరుచుకుపడుతుండటంతో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ .. తక్షణమే కాల్పులు ఆపాలని ఇరు దేశాలకు సూచించారు. ట్రంప్ పిలుపునిచ్చిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్‌‎పై సైనిక చర్య నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -