Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనాగారంలో ఉచిత వైద్య శిబిరం

నాగారంలో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-నాగారం
వాసుదేవ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఆద్వర్యములో సొసైటీ సభ్యులకు, స్థానికులు, శ్రీయోభిలాషులకు ఉచిత వైద్య శిబిరము” ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీ ధరణి హస్పిటల్‌ యాజమాన్యంతో కలసి వాసుదేవ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలనరసింహ, డాక్టర్‌ మహేందర్‌ , సొసైటీ చైర్మెన్‌ రామారావు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉచిత వైద్య శిబిరములో అన్ని రకాల రక్తపరీక్షలు, డాక్టర్‌ కన్సల్టెన్సీ, మరియు ఉచితంగా మందులు పంపిణి చేశారు. సోసైటీ చైర్మెన్‌ రామారావు మాట్లాడుతూ సొసైటీ సభ్యులకు ప్రతి ఆరు నెలలకు ఒక సారి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. స్థానిక ప్రజలు సొసైటీ అందించే వైద్య, ఆర్థిక సేవలను వినియోగించుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -