- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌లోని పాట్నా సివిల్ కోర్టుకు ఈ మెయిల్ బాంబు బెదిరింపు వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కోర్టుకు చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ తోపాటు బాంబు స్వ్కాడ్ టీంతో కోర్టు వెలుపల, పరిసర ప్రాంతాల్లో కుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి బాంబు ఆనవాళ్లు లభ్యంకాకపోవడంతో అధికారులు ఊపిరిపిల్చుకున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కోర్టుకు అదనపు భద్రతా కల్పించారు. కోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
- Advertisement -



